Tirupati: ఎన్నికల వేళ ఆదర్శవంతం... ఆ ఆటోవాలా ప్రచారం!

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల వేళ ధనప్రవాహానికి అడ్డే లేదన్న విమర్శలున్నాయి. మద్యం పంపిణీ విచ్చలవిడిగా సాగుతుందన్న ఆరోపణ ఎలాగూ ఉంది. కాసింత డబ్బు, కొద్దిసేపు ఆనందాన్నిచ్చే మద్యం కోసం విలువైన ఓటు అమ్ముకునే వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఆధ్యాత్మిక సిటీ తిరుపతికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ వినూత్న ప్రచారం మొదలు పెట్టాడు.

 పట్టణంలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మూడో గేట్‌ ఆటో స్టాండ్‌కు చెందిన వెంకటేశ్ తన ఆటో వెనుక భాగాన ‘మా ఓటు మీకే...మీ నోటు మాకొద్దు, మేము మీ పక్షమే...మీ మందు మాకివ్వద్దు’ అని రాయించిన ఫ్లెక్సీని అంటించి ప్రచారం చేస్తున్నాడు. స్థానికులు దీన్ని చాలా ఆసక్తిగా గమనిస్తూ అతని చర్యను మనసులోనే అభినందిస్తున్నారు. వెంకటేశ్ ప్రయత్నంతో ఏ కొద్దిమందిలో మార్పు వచ్చినా ప్రజాస్వామ్యానికి మంచి జరిగినట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Go Back to Shorts
Tirupati
autowala
awareness action

More Telugu News