శ్రీకాకుళం జిల్లాలో భారీగా నగదు స్వాధీనం.. బస్సులోని 30 మంది పోలీస్ స్టేషన్ కు తరలింపు!
- బస్సులో పాలకొండ వైసీపీ నేత తనయుడు
- నగదు రూ.కోటి వరకూ ఉండొచ్చని అంచనా
- అందరినీ విచారిస్తున్న రాజాం పోలీసులు
ఈ బస్సు శ్రీకాకుళం నుంచి పాలకొండకు వెళుతుండగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను రాజాం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఈ నగదును ఎవరు తరలిస్తున్నారు? అని అందరినీ విచారిస్తున్నారు. కాగా, ఇదే బస్సులో పాలకొండకు చెందిన వైసీపీ నేత తనయుడు విక్రాంత్ ఉండటంతో ఆయన్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.