Jagan: న్యాయంగా అయితే నేను జగన్ తోనే ఉండాలి!: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
నిత్యమూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో ఉండే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. తన ఒంట్లో ఉన్నది కాంగ్రెస్ రక్తమేనని ఆయన అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను చిన్నప్పటి నుంచి చూశానని, న్యాయంగా ఆలోచిస్తే, తాను జగన్ వెంటే ఉండాలని బాంబు పేల్చారు. అయితే, జగన్ బుద్ధి ఎలావుంటుందో తనకు బాగా తెలుసునని, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరానని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.
Go Back to Shorts
Jagan
JC
Diwakar Reddy
Telugudesam

More Telugu News