nagarjuna: 'బంగార్రాజు' కథానాయికగా నయనతార?

షార్ట్స్‌లో చూడండి
నాగార్జున ... కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో కొంతకాలం క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర బాగా పాప్యులర్ అయింది. దాంతో అదే టైటిల్ తో సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి నాగార్జున అప్పట్లోనే వచ్చారు. ఆయన ప్రయత్నం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది.

 ఎన్నికలు పూర్తి కాగానే నాగార్జున తన సొంత బ్యానర్లో ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగార్జున సరసన కథానాయికగా నయనతార అయితే బాగుంటుందని భావించిన కల్యాణ్ కృష్ణ .. తాజాగా ఆమెతో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. గతంలో నాగ్ .. నయనతార కాంబినేషన్లో 'బాస్' .. 'గ్రీకువీరుడు' వచ్చిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
nagarjuna
nayanatara

More Telugu News