'కాంచన' హిందీ రీమేక్ లో తను చేయడం లేదట
- హిందీలోకి 'కాంచన' రీమేక్
- అక్షయ్ జోడీగా కైరా అద్వాని
- క్లారిటీ ఇచ్చిన శోభిత ధూళిపాళ
అయితే ఈ సినిమాలో శోభిత ధూళిపాళ చేయనుందనే వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో అవకాశం లభించినందుకు గాను ఆమెను అభినందిస్తూ సన్నిహితులు కాల్స్ చేయడం .. మెస్సేజ్ లు పెట్టడం చేస్తున్నారట. గూగుల్లో వచ్చిన వార్తలే అందుకు కారణమని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయిందట. ఆ తరువాత .. ఆ సినిమాకి సంబంధించిన వాళ్లెవరూ తనని సంప్రదించలేదనీ .. తాను ఈ సినిమా చేయడం లేదని చెప్పుకుంటూ వస్తోందట. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు హిందీలోను ఒకటి రెండు సినిమాలు చేస్తోంది.