'నాలాగే మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు' అని పవన్ కల్యాణ్ గారితో అన్నాను: నటి హేమ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నాలాగే మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు' అని పవన్ కల్యాణ్ గారితో అన్నాను: నటి హేమ

  • పవన్ కల్యాణ్ గారితో 'అన్నవరం' చేశాను
  •  నా నటనను పవన్ కల్యాణ్ గారు మెచ్చుకున్నారు
  •  అప్పుడు నేను అలా అనేసినా నవ్వుతూ వెళ్లిపోయారు 
తాజా ఇంటర్వ్యూలో నటి హేమ మాట్లాడుతూ .. ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "పవన్ కల్యాణ్ గారు హీరోగా చేసిన 'అన్నవరం' సినిమాలో నాది చాలా మంచి పాత్ర. ఆ సినిమాలో నేను ఒక పవర్ఫుల్ డైలాగ్ కూడా చెప్పాను. ఆ సీన్ చూసిన పవన్ కల్యాణ్ గారు నా దగ్గరికి వచ్చి, "హేమగారూ, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారండీ .. చాలా నేచురల్ గా ఉంటుంది" అన్నారు.

అప్పుడు నేను థ్యాంక్స్ అంటే బాగుండేది .. కానీ "నాలాగే మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారండీ" అన్నాను. అక్కడ నా ఉద్దేశం ఏమిటంటే పవన్ కల్యాణ్ గారు కూడా చాలా నేచురల్ గా చేస్తారని .. కానీ నా నోటి నుంచి అలా వచ్చేసింది. అయినా ఆయన పెద్దగా పట్టించుకోకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించాను" అని చెప్పుకొచ్చారు. 
hema
pavan

More Telugu News