saitej: 'చిత్రలహరి' ప్రీ రిలీజ్ వేడుక తేదీ ఖరారు

షార్ట్స్‌లో చూడండి
ప్రేమకథా చిత్రాలతో కుర్రకారును మెప్పించే దర్శకుడిగా కిషోర్ తిరుమలకి మంచి పేరుంది. ఆయన తాజా చిత్రంగా 'చిత్రలహరి' నిర్మితమైంది. సాయితేజ్ .. కల్యాణి ప్రియదర్శన్ .. నివేద పేతురాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ .. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపడానికి రంగంలోకి దిగింది.

ఈ నెల 6వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఆ దిశగా చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారనేది తెలియనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే ఆశాభావంతో సాయితేజ్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.
Go Back to Shorts
saitej
kalyani
niveda

More Telugu News