Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సమంత
  • ఉగాదికి మహేశ్ సినిమా టీజర్
  • సందీప్ కిషన్ చిత్రంలో యువ దర్శకుడు 

*  పెళ్లి తర్వాత కూడా కథానాయికగా బిజీగా వున్న సమంత తాజాగా ఓ చిత్రంలో స్పెషల్ రోల్ చేయడానికి ఓకే చెప్పింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందుతున్న 'మన్మథుడు 2'లో సమంత ప్రత్యేక పాత్రను పోషించనుంది.
*  మహేశ్ బాబు నటిస్తున్న 'మహర్షి' చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఉగాది రోజున (శనివారం) విడుదల చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
*  యంగ్ హీరో సందీప్ కిషన్ నిర్మాతగా మారి 'నిను వీడని నీడను నేనే' పేరిట ఓ హారర్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో తమిళ యువ దర్శకుడు కార్తీక్ నరేన్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు.

More Telugu News