వాళ్లిచ్చే డబ్బు తీసుకోండి.. ఓటు మాత్రం మాకు వేయండి: కేఏ పాల్

  • మా అభ్యర్థులను టీడీపీ పెట్టించిందని వైసీపీ ఆరోపిస్తోంది
  • ఎన్నికల వాయిదా కోసం కోర్టులో ఫిర్యాదు చేయాలి
  • ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఏపీని అమెరికా చేస్తా
తమ ప్రజాశాంతి పార్టీకి చెందిన 38 మంది అభ్యర్థులను టీడీపీ పెట్టించిందని వైసీపీ ఆరోపిస్తోందని... ఈ విషయంపై తమతో కలిసి ఎన్నికల వాయిదాకు కోర్టులో ఫిర్యాదు చేసేందుకు వైసీపీ కలసి రావాలని కేఏ పాల్ అన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే కోర్టులో పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.

అవినీతి పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఇచ్చే డబ్బును తీసుకుని, ఓటు మాత్రం ప్రజాశాంతి పార్టీకి వేసి గెలిపించాలని కోరారు. హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేయాలని విన్నవించారు. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే... రాష్ట్రాన్ని అమెరికా చేస్తానని చెప్పారు. నరసాపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
ka paul
narasapuram
praja shanthi party
ysrcp

More Telugu News