chiranjeevi: తదుపరి షెడ్యూల్ కి సిద్ధమవుతోన్న 'సైరా'

  • షూటింగు దశలో  చిరూ 'సైరా'
  • ఈ నెల 9 నుంచి తదుపరి షెడ్యూల్
  • ఆగస్టులో విడుదల చేసే ఛాన్స్       

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితచరిత్రగా నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అమితాబ్ .. జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ .. కోకాపేటలో వేసిన 'బీదర్' కోట సెట్లో, ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 9వ తేదీ నుంచి ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ కారణంగానే యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని చెబుతున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.

More Telugu News