భక్తులు శ్రీవారికిచ్చే విరాళాలు పక్కదారి పడుతున్నాయి : రమణ దీక్షితులు
- స్వామి సేవకు వాటిని వినియోగించడం లేదు
- ఇతర కార్యాలకు వినియోగించడం భక్తులకు క్షేమం కాదు
- అందువల్ల తిరుమల హుండీల్లో డబ్బులు వేయొద్దు
హుండీలో వేసిన డబ్బు స్వామి సేవకు కాకుండా ఇతరత్రా కార్యక్రమాలకు వినియోగించడం భక్తులకు క్షేమదాయకం కాదని రమణ దీక్షితులు అభిప్రాయపడ్డారు. అందువల్ల భక్తులు తిరుమల హుండీల్లో డబ్బు వేయకుండా ధూపదీపాల్లేని ఆలయాల అర్చకుల జీతాలకు, నైవేద్యాలకు విరాళంగా అందజేస్తే పుణ్యం వస్తుందని సూచించారు. విరాళాలను ఏ ఆలయానికి ఇచ్చినా నేరుగా స్వామి వారికే చేరుతాయని చెప్పారు.