ప్రియుడి చదువు కోసం లక్షన్నర ఇచ్చి మోసపోయిన యువతి!
- కాలేజీ రోజుల్లోనే ప్రేమ
- ఐదేళ్ల పాటు సహజీవనం
- పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
- అతని ఇంటిముందు యువతి నిరసన
తామిద్దరం పెళ్లి చేసుకుంటామని, మరో సంబంధం చూడవద్దని చెప్పాడు. ఆపై కాగ్నిజెంట్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరాడు. ఆపై దాదాపు ఐదు సంవత్సరాలుగా ఇద్దరూ సహజీవనం చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని నర్మద కోరగా, చెల్లి పెళ్లి తరువాత చేసుకుందామని నమ్మించాడు. చెల్లి పెళ్లి తరువాత, తన తల్లి ఒప్పుకోవడం లేదని, పెళ్లి చేసుకోలేనని చెబుతూ, నర్మదను దూరం పెట్టసాగాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై తనకు న్యాయం జరగడం ఆలస్యమవుతోందని ఆరోపిస్తూ, ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు పెళ్లంటూ జరిగితే మోహన్ తోనే జరగాలంటూ భీష్మించుకుకూర్చుంది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి.