నితిన్ కొత్త చిత్రం టైటిల్ 'పవర్ పేట'
- కృష్ణ చైతన్యతో నితిన్
- మూడు భాషల్లో నిర్మాణం
- త్వరలో మిగతా వివరాలు
ఈ సినిమాకి 'పవర్ పేట' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనేది తాజా సమాచారం. ఫిల్మ్ చాంబర్లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయనున్నారనీ .. దాదాపు ఇదే టైటిల్ ఖరారు అవుతుందని చెబుతున్నారు. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాను .. తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో రూపొందించనున్నట్టు సమాచారం. ఈ మూడు భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో ఉంటారని చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.