'తుగ్లక్' టైటిల్ తో కల్యాణ్ రామ్ కొత్త సినిమా
- '118'తో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్
- తదుపరి సినిమా వేణు మల్లిడితో
- నాయికలుగా రకుల్ .. కేథరిన్
ఈ సినిమాకి 'తుగ్లక్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. కథా కథనాలు .. తన పాత్ర .. తన లుక్ కొత్తగా ఉండేలా కల్యాణ్ రామ్ శ్రద్ధ పెట్టాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనుండటం విశేషం. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో రూపొందనున్న ఈ సినిమాలో కథానాయికలుగా రకుల్ .. కేథరిన్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన పనులు చకచకా జరుగుతున్నాయి.