‘నీవల్లే బతికున్నా సామీ’ అని చంద్రబాబును కౌగిలించుకున్న నర్సమ్మ.. చప్పట్లు, ఈలలతో మార్మోగిన పుట్టపర్తి సభావేదిక!
- అనంతపురం జిల్లా పుట్టపర్తిలో టీడీపీ ప్రచారం
- హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- చంద్రబాబుతో కలిసి సైకిల్ ఎక్కిన నర్సమ్మ
తనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పటికీ, తన పెద్దకొడుకు చంద్రబాబే తనకు అన్నం పెడుతున్నాడని పేర్కొంది. ఈ సందర్భంగా ‘నీవల్లే నేను బతికున్నా సామీ’ అని చంద్రబాబును నర్సమ్మ ఒక్కసారిగా కౌగిలించుకుంది. దీంతో సభావేదిక ఒక్కసారిగా చప్పట్లు, ఈలలతో దద్దరిల్లింది. అనంతరం తాను ఎక్కిన సైకిల్ పై నర్సమ్మను ఎక్కించుకుని చంద్రబాబు ఫొటోలు దిగారు.