అక్కడ ఉగ్రశిబిరాలు లేవు...భారత్ ఇచ్చిన ఆధారాలపై పాక్ స్పందన ఇది
- 22 ప్రాంతాల్లో మా దర్యాప్తులో తేలింది ఇదే
- భారత్ చూస్తామన్నా చూపించేందుకు సిద్ధం
- పుల్వామా దాడి తర్వాత ఆధారాలు అందించిన భారత్
దాడి అనంతరం తమ వద్ద ఉన్న ఆధారాలను పాకిస్థాన్ హైకమిషనర్‌కు భారత్ అందించింది. వీటిపై దర్యాప్తు నిర్వహించామని, అసలా ప్రాంతాల్లో అటువంటి శిబిరాలేవీ కనిపించలేదని పాకిస్థాన్ తెలిపింది. భారత్‌కు అనుమానం ఉండి చూస్తామంటే ఆ ప్రాంతాలను చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. చాలామందిని అదుపులోకి తీసుకుని విచారించామని, చాలామంది సోషల్ ఖాతాలను పరిశీలించామని, పుల్వామా దాడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది.