నెల్లూరు టీడీపీలో ఉత్సాహం నింపిన నటుడు తారకరత్న!
- నెల్లూరు రూరల్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం
- ర్యాలీ నిర్వహించిన తారకరత్న
- సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన
తాజాగా, నెల్లూరు జిల్లాలో పర్యటించిన నందమూరి తారకరత్న, జిల్లా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న అబ్దుల్ అజీజ్ కు మద్దతుగా నగరంలోని వేదాయపాలెం నుంచి గాంధీ నగర్ వరకూ ర్యాలీ నిర్వహించిన తారకరత్న, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైనే ప్రతి ఒక్కరూ ఓటేయాలని కోరారు.