సుమలతకు పోటీగా ముగ్గురు 'సుమలత'లు నామినేషన్!
- మాండ్యాలో ఆసక్తికరంగా పోరు
- బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ముగ్గురు సుమలతలు
- ఓటర్లను గందరగోళ పరచడానికేనంటున్న సుమలత వర్గం
కనకపుర ప్రాంతానికి చెందిన పి. సుమలత, శ్రీరంగపట్న ప్రాంతానికి చెందిన సుమలత, కేఆర్ పేట్ తాలూకాకు చెందిన ఎం సుమలత పోటీలో ఉన్నారు. వీరు ముగ్గురూ స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలో ఉన్నప్పటికీ, ఈవీఎంలలో సుమలత అన్న పేర్లన్నీ ఒకే చోట ఉండటంతో ఓటర్లు, అయోమయంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఓ బలమైన అభ్యర్థిని ఓడించాలన్న ఉద్దేశంతో ఈ తరహాలో ఒకే పేరున్న వాళ్లను రంగంలోకి దించడం సర్వ సాధారణమే. ఓటర్లను గందరగోళ పరిచే ఉద్దేశంతోనే ఈ తరహా కుట్రలు చేస్తున్నారని సుమలత వర్గం ఆరోపిస్తోంది. ఓటర్లంతా సుమలత ఫోటోను చూసి మాత్రమే ఓటు వేయాలని వారు ప్రజలకు చెబుతున్నారు.