ఎన్నికల ఖర్చుకి విరాళంగా కనీసం ఒక్క రూపాయి ఇచ్చినా చాలు: కన్హయ్య కుమార్ అభ్యర్థన
- పెరుగుతోన్న ఎన్నికల వేడి
- సీపీఐ నుంచి కన్హయ్య కుమార్ కి టికెట్
- ఆన్ లైన్ వేదికగా ప్రజల నుంచి విరాళాలు
సీపీఐ నుంచి బీహార్ లోని బెగుసరెయ్ లోక్ సభ టికెట్ అందడంతో, కన్హయ్య కుమార్ రంగంలోకి దిగాడు. ప్రచారానికి అవసరమైన నిధులు లేకపోయినా ఆయన నిరాశపడటం లేదు. ఆన్ లైన్ వేదికగా ప్రజల నుంచి విరాళాలు కోరుతున్నాడు. 'ఒక్కో నీటి బొట్టు కలిస్తే కుండ నిండుతుంది .. మీరిచ్చే ఒక్కో రూపాయి నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి సాయపడుతుంది .. కనీసం ఒక్క రూపాయైనా ఇవ్వండి చాలు' అంటూ ఆయన విరాళాలు సేకరిస్తున్నాడు. ఇదే స్థానం నుంచి బీజేపీ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బరిలోకి దిగడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది.