akula shiva: నీలాంటివాడిని నేనే ఇంటికి పిలవను .. మెగాస్టార్ పిలుస్తారా?: చిన్నికృష్ణపై విరుచుకుపడ్డ రచయిత ఆకుల శివ

షార్ట్స్‌లో చూడండి
సినీ రచయిత చిన్నికృష్ణ రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవికి ఒక రచయితగా 'ఇంద్ర'వంటి సంచలన విజయాన్ని అందిస్తే భోజనం కూడా పెట్టలేదనీ .. 10 రూపాయలు పెట్టి 'బాల్ పెన్' కూడా కొనిపెట్టలేదని చిన్నికృష్ణ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయంపై మరో రచయిత ఆకుల శివ స్పందించారు.

 "చిన్నికృష్ణా .. నువ్వు ఎలాంటివాడివో నాకు తెలుసు .. నేనే నిన్ను ఇంటికి పిలవను .. అలాంటిది చిరంజీవి గారు ఇంటికి పిలుస్తారా? నేను రాసిన 'నాయక్' సినిమా హిట్ అయితే చిరంజీవిగారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి .. 5 లక్షల రూపాయలు చేతిలో పెట్టి తన 150వ సినిమాకి కథ - మాటలు రాయమన్నారు .. అదీ ఆయన సంస్కారం. వ్యక్తిగతంగా చిరంజీవిని .. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశావు గనుకనే నేను రంగంలోకి దిగాను. నువ్వు మళ్లీ స్పందిస్తే .. నీకు సంబంధించిన మొత్తం బుక్ ను నేను ఓపెన్ చేస్తాను" అని హెచ్చరించారు.
Go Back to Shorts
akula shiva

More Telugu News