Chandrababu: ఒంగోలు సభలో పవన్ కల్యాణ్ ను అభినందించిన చంద్రబాబు!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారెందుకని కేసీఆర్ ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్ ను తాను అభినందిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒంగోలు సభలో ఉద్ఘాటించారు. తెలంగాణ వెళితే ఆంధ్రావాళ్ల పెత్తనం అంటూ కేసీఆర్ నోరుపారేసుకుంటాడని, ఏం ఆంధ్రులు దేశంలో తిరగకూడదా? ఆంధ్రులు మనుషులు కాదా? ఆంధ్రులకు పౌరుషం లేదా? అని ప్రశ్నించారు.

ఇదే విషయం పవన్ కల్యాణ్ కూడా అడిగారని, కేసీఆర్ ను తీవ్రస్థాయిలో విమర్శించారని చంద్రబాబు తెలిపారు. కేసీఆర్ నువ్వెవరు మా రాష్ట్రంలో జోక్యం చేసుకోవడానికి? అంటూ పవన్ నిలదీశాడని, దమ్ముంటే ఏపీకి రా నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరాడని చెప్పారు. వైసీపీ ముసుగులో మాత్రం రావొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడని చంద్రబాబు పవన్ గురించి గొప్పగా చెప్పారు.

పవన్ అంత తెగింపుతో మాట్లాడినందుకు తప్పకుండా అభినందించాలని ఒంగోలు రోడ్ షోలో టీడీపీ అధినేత పేర్కొన్నారు. ఓవైపు పవన్ కల్యాణ్ కేసీఆర్ ను ఏకిపారేస్తుంటే నువ్వు మాత్రం ఊడిగం చేస్తావా? నీ కోడికత్తి పార్టీ కేసీఆర్ కు దాసోహం అంటుందా? అంటూ జగన్ పై మండిపడ్డారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
KCR

More Telugu News