Posani Krishna Murali: హైదరాబాద్ లో ఒకే ఒక్క ఆంధ్రుడ్ని చంపారు, చంపింది కూడా ఆంధ్రుడే!: పోసాని తీవ్ర వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ఆంధ్రులకు అన్యాయం జరుగుతోందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారంటూ నటుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శల వర్షం కురిపించారు. ఆంధ్రులు తెలంగాణ వాళ్ల చేతిలో తన్నులు తింటున్న ఒక్క క్లిప్పింగ్ అయినా చూపించగలవా పవన్? అంటూ పోసాని సవాల్ చేశారు. కనీసం, తెలంగాణలో తన్నులు తిని ఆంధ్రాకు పారిపోయి తలదాచుకున్నవాళ్లను ఒక్కళ్లను చూపించగలవా? ఎందుకు ఇలా విద్వేషాలు రెచ్చగొడతావు? అంటూ హితవు పలికారు.

అయితే, పవన్ కల్యాణ్ చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం నిజం ఉందని, ఒకే ఒక్క ఆంధ్రుడు హైదరాబాద్ నడిబొడ్డున చనిపోయాడని, ఆ చంపింది కూడా ఆంధ్రుడేనని అన్నారు. ఆ చనిపోయిన వ్యక్తి ది గ్రేట్ ఎన్టీరామారావు గారు అయితే, చంపిన వ్యక్తి చంద్రబాబు అంటూ పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'పవన్ కల్యాణ్, ఇదీ జరిగింది! మరి తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ ను చంపింది చంద్రబాబు అంటూ ఆ విషయాన్ని నీ ప్రసంగంలో ఎందుకు చెప్పలేదు?' అంటూ నిలదీశారు.
Go Back to Shorts
Posani Krishna Murali
Pawan Kalyan

More Telugu News