నన్ను భీమవరం ఎమ్మెల్యేని చేయండి..అంతర్జాతీయ నగరంగా చేస్తా: పవన్ కల్యాణ్
- భీమవరంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కల్యాణ్
- ఈ నగరాన్ని విశ్వనగరంగా తయారు చేస్తా
- ఇక్కడి ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారు..సమస్యలు పరిష్కరించలేదు
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే ఏం చేశారో తనకు తెలియదని, తనను భీమవరం ఎమ్మెల్యేని చేస్తే, దీన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానని, భీమవరాన్ని విశ్వనగరంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించుకున్నారు గానీ, ఇక్కడి డంపింగ్ యార్డు తరలించలేకపోయారని, యనమదురు డ్రెయిన్ సమస్యను తీర్చలేకపోయారని విమర్శించారు.