యూజర్ల పాస్ వర్డ్ లు మా ఉద్యోగులకు తెలుసు... షాకింగ్ న్యూస్ చెప్పిన ఫేస్ బుక్!
- పాస్ వర్డ్ లు ఇంటర్నల్ సర్వర్లలో దాచాం
- ఉద్యోగులు తప్ప బయటివారు చూడలేరు
- దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు లేవు
- వెల్లడించిన ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్
ఇప్పటికే డేటా భద్రతపై అందోళన వెల్లువెత్తుతున్న వేళ, పాస్ వర్డ్ లను ప్లెయిన్ టెక్ట్స్ ఫార్మాట్ లో సర్వర్లలో దాచామని, అవి సంస్థ ఉద్యోగులకు తప్ప మరొకరికి కనిపించవని చెప్పడం భద్రతా నిబంధనలకు విరుద్ధమేనని సైబర్ నిపుణులు మండిపడుతున్నారు. కాగా, ఫేస్ బుక్ పాస్ వర్డ్ ల విషయమై 'క్రెబ్స్ ఆన్ సెక్యూరిటీ డాట్ కామ్' అనే సెక్యూరిటీ న్యూస్ వెబ్ సైట్ గతంలోనే కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. దాదాపు 60 కోట్ల మంది పాస్ వర్డ్ లు సాధారణ అక్షరాల్లో ఉన్నాయని, వీటిని సుమారు 20 వేల మంది ఉద్యోగులు చూస్తున్నారని సంస్థ తెలిపింది.