అంతర్గత విభేదాలే కాంగ్రెస్‌కు శాపం: డి.కె.అరుణ
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అదే కారణం
- సీఎం కేసీఆర్‌ను ఓడించాలంటే బలమైన ప్రత్యామ్నాయం ఉండాలి
- అది బీజేపీతోనే సాధ్యం
మహబూబ్‌నగర్‌కు చెందిన అరుణ నిన్న రాత్రి బీజేపీలో చేరిన సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే మరో బలమైన జాతీయ పార్టీ కావాలని, అది బీజేపీ వల్లే సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ వినియోగించుకోలేక పోయిందన్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ కాంగ్రెస్ పూర్తిగా బహీనపడిపోయిందని అరుణ అభిప్రాయపడ్డారు. ఇక అధికారం, మరో ప్రయోజనం కోసం లాలూచీ పడ్డవారే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. బీజేపీలో చేరిన డి.కె.అరుణ మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది.