కారు డ్రైవర్ కోసం .. పనిమనిషి కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన అలియా భట్
- యూత్ లో అలియా భట్ కి క్రేజ్
- ఇటీవలే జరిగిన పుట్టినరోజు వేడుక
- మంచి మనసున్న అలియా భట్
అలియా భట్ కారు డ్రైవర్ గా 'సునీల్' .. ఆమె పనిమనిషిగా 'అమోల్' చాలా కాలంగా పనిచేస్తున్నారు. తన దగ్గర చాలా కాలంగా .. చాలా నమ్మకంగా పనిచేస్తోన్న ఈ ఇద్దరికీ, ఈ పుట్టినరోజు సందర్భంగా చెరో గిఫ్ట్ ఇవ్వాలని అలియాభట్ నిర్ణయించుకుందట. ఇద్దరికీ కూడా చెరో 50 లక్షలు పెట్టి ఇల్లు కొనిపెట్టేసింది. ఆ ఇద్దరి కోసం ఆమె అలా కోటి రూపాయలను ఖర్చు చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మంచి మనసును గురించి అంతా చెప్పుకుంటున్నారు.