పోలీసుల అదుపులో యాంకర్ రష్మి కారు డ్రైవర్ గౌతమ్!

  • నిన్న రాత్రి యాక్సిడెంట్ చేసిన గౌతమ్
  • ఆ సమయంలో కారులోనే ఉన్న రష్మి
  • కేసును విచారిస్తున్న పోలీసులు
గత రాత్రి విశాఖ సమీపంలో నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కావడానికి కారకుడయ్యాడన్న అభియోగాలపై యాంకర్ రష్మి కారు డ్రైవర్ ఎంఎ గౌతమ్ ను దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లిలో జరిగిన ఓ కార్యక్రమానికి తాను కొన్న కొత్త కారు 'టీఎస్ 11 ఈఈ 1789'లో తల్లితో కలిసి వచ్చిన రష్మి, తిరుగు ప్రయాణంలో వెళుతున్న వేళ, కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రష్మి, ఆమె తల్లి కూడా ఉన్నారు. ఈ ఘటనలో రోడ్డు దాటే ప్రయత్నంలో ఉన్న చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన  లారీ డ్రైవర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ గాయపడ్డాడు. అతనికి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా, పోలీసులు కేసును విచారిస్తున్నారు.
Go Back to Shorts
Rashmi
Anchor
Vizag
Road Accident

More Telugu News