nayanatara: నయనతార హారర్ థ్రిల్లర్ వచ్చేస్తోంది

షార్ట్స్‌లో చూడండి
తమిళనాట కథానాయికగా నయనతార తిరుగులేని కెరియర్ ను కొనసాగిస్తోంది. విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలు నయనతారకి వీలైనన్ని విజయాలను కట్టబెడుతున్నాయి. ఆమె తాజా చిత్రంగా 'ఐరా' రూపొందింది. సర్జున్ కె.ఎమ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ లో, నయనతార ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.హారర్ సినిమాల్లో చేయడం నయనతారకి కొత్తకాదు. కానీ ద్విపాత్రాభినయం చేయడం ఆమెకి ఇదే మొదటిసారి. ఈ అంశమే ఈ సినిమాకి ఆసక్తికరమైనదిగా మారింది. కోటపాడి రాజేశ్ .. మహేశ్వరన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, తమిళంలో ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా ఈ సినిమాను తీసుకురానున్నారు. ఈ రెండు భాషల్లోను నయనతార ఒకేసారి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
Go Back to Shorts
nayanatara

More Telugu News