చర్చ్ లో పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్.. స్వయంగా వైద్యం చేస్తున్న భార్య మమతారాణి!
- పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్
- జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నం
- తానూ డాక్టర్ నేనని పోలీసులకు గుర్తు చేసిన మమతారాణి
దీంతో సునీల్ కు వారు కాల్ చేయగా, మమతారాణి లిఫ్ట్ చేశారు. తాము క్షేమంగా ఉన్నామని ఒకే ఒక్క మాట చెప్పి కాల్ కట్ చేశారామె. దీంతో వారి ఆచూకీకోసం విచారణ చేపట్టగా, ఓ చర్చ్ లో వారు ఉన్నట్టు తెలిసింది. అక్కడకు వెళ్లాగా, సునీల్ ఎడమచేతి మణికట్టుకు బ్యాండేజ్ కట్టివుంది. సెలైన్ ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు జరిగివున్నాయి. దీంతో సునీల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులు నిర్ణయించుకోగా, మమతారాణి అడ్డుకుని, తానుకూడా డాక్టర్ నేని, తన భర్తకు వైద్యం చేసుకుంటానని గట్టిగా చెప్పారు. దీంతో చేసేదేమీలేక, కొంతమంది పోలీసులను అక్కడ కాపలాగా పెట్టి వెళ్లిపోయారు.