అనుచరులతో ఎస్వీ మోహన్‌రెడ్డి భేటీ.. టిక్కెట్ రాకుంటే ఏం చేయాలన్న దానిపై చర్చ
- టికెట్ రాకుండా కొందరు అడ్డుకుంటున్నారు
- వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నా
- రెండో జాబితాలో కచ్చితంగా పేరు ఉంటుంది
ఆయనకు టికెట్ రాదని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, తనకు టికెట్ రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని, వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. టీడీపీ రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని, ఒకవేళ లేకుంటే కనుక కార్యకర్తల నిర్ణయానికి తలవంచుతానన్నారు.