jagan: జగన్ సోదరి షర్మిల నుంచి వివరాలు సేకరిస్తున్న సిట్ అధికారులు

షార్ట్స్‌లో చూడండి
వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. వివేకా నివాసంలోని బెడ్ రూమ్, బాత్ రూమ్ లను సీఐడీ చీఫ్ అమిత్ గార్గ్, సిట్ ఇన్ ఛార్జ్ అభిషేక్ మహంతిలు పరిశీలించారు. మరోవైపు వివేకా కుమార్తె సునీత, వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల నుంచి సిట్ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. హత్యకు సంబంధించి ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సిట్ అదుపులోకి తీసుకున్న వారిలో వివేకా డ్రైవర్ ప్రసాద్, పీఏ కృష్ణారెడ్డి, ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పనిమనిషి లక్ష్మి ఉన్నారు.
Go Back to Shorts
jagan
sharmila
ys viveka
sit
ysrcp

More Telugu News