ముగిసిన కేసీఆర్ - సబిత భేటీ.. కారెక్కెందుకు లైన్ క్లియర్!

  • స్నేహపూర్వకంగానే కలిశాం
  • మేము అడగాల్సినవి అడిగాం
  • కేసీఆర్ చెప్పాల్సినవి చెప్పారు
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ ముగిసింది. తన ముగ్గురు కుమారులతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లిన సబిత.. కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని చెప్పారు. తాము అడగాల్సినవి అడగ్గా.. ఆయన చెప్పాల్సినవి చెప్పారని.. చేవెళ్లలో జరగబోయే భారీ బహిరంగ సభలో తాము టీఆర్‌ఎస్‌లో చేరుతామని తెలిపారు. అయితే ఈ భేటీలో సబిత.. తన కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ స్థానం, అలాగే తనకు మంత్రి పదవి కోరినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఎంపీ స్థానం ఇచ్చేందుకు అంగీకరించాని తెలుస్తోంది.
Go Back to Shorts
Sabitha Indrareddy
Karthik Reddy
KCR
Chevella
TRS

More Telugu News