Vijay: విజయ్ దేవరకొండ 'హీరో' అప్ డేట్స్

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో బహు భాషా చిత్రంలో నటించనున్నాడు. నూతన దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి 'హీరో' అనే టైటిల్ని ఖరారు చేశారు. తెలుగు తమిళ, కన్నడ మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ ఏకకాలంలో నిర్మిస్తోంది. కాగా, ఈ చిత్రం షూటింగును ఏప్రిల్ 22న ప్రారంభించనున్నట్టు మైత్రీ మూవీస్ సంస్థ ప్రకటించింది. తొలి షెడ్యూలు షూటింగును ఢిల్లీలో నిర్వహిస్తారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందే ఈ చిత్రంలో విజయ్ బైకర్ గా కనిపిస్తాడు. ఇందులో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది.    
Go Back to Shorts
Vijay
Dear Comrade
Malavika
Heero

More Telugu News