kcr: ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇవ్వను: కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇవ్వనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈరోజు జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీకి నష్టం చేసినందుకు వారికి టికెట్ నిరాకరిస్తున్నామని చెప్పారు. పార్టీకి నష్టం చేసే ఏ ఒక్కరినీ ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బలం లేదని చెప్పినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టిందని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోకూడదనే అనుకున్నామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. ఈ ఉదయం కూడా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తనతో మాట్లాడారని తెలిపారు.
Go Back to Shorts
kcr
TRS
mp
ticket
congress

More Telugu News