నిజామాబాద్ లో 1.25 లక్షల నకిలీ ఓట్లు.. తొలగించాలని కలెక్టర్ కు బీజేపీ ఫిర్యాదు!
- త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలు
- కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ నేతలు
- చర్యలు తీసుకుంటామని హామిఇచ్చిన కలెక్టర్
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ ఓట్లను తొలగించకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపవద్దని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఏకంగా 1,25,000 నకిలీ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. వీటిపై విచారణ జరిపి సత్వరం చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. ఈ విషయంలో కలెక్టర్ సానుకూలంగా స్పందించారనీ, బోగస్ ఓట్ల ఏరివేతపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలిగా టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఉన్నారు.