aamir khan: హాలీవుడ్ రీమేక్ లో ఆమిర్ ఖాన్

షార్ట్స్‌లో చూడండి
ఆమిర్ ఖాన్ కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. సినిమా .. సినిమాకి కొత్తదనాన్ని చూపిస్తూ, అశేష ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆమిర్ ఖాన్ ఎంచుకున్న కథలు .. విలక్షణమైన పాత్రలు .. ఆ పాత్రల్లో ఆయన ఒదిగిపోయే తీరు ఆయన క్రేజ్ ను పెంచుతూ వెళ్లాయి. అలాంటి ఆమిర్ ఖాన్ త్వరలో ఒక హాలీవుడ్ రీమేక్ లో నటించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది .. ఆ సినిమాయే 'ఫారెస్ట్ గంప్'.

కొంతకాలం క్రితం వచ్చిన 'ఫారెస్ట్ గంప్' హాలీవుడ్ క్లాసిక్స్ లలో ఒకటిగా నిలిచిపోయింది. టామ్ హాంక్స్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, 6 ఆస్కార్ పురస్కారాలను సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమా రీమేక్ హక్కులను ఆమిర్ ఖాన్ దక్కించుకున్నాడట. ఆమిర్ ఖాన్ చేయనున్న ఈ సినిమా గురించే ఇప్పుడు అంతా బాలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు. 
Go Back to Shorts
aamir khan

More Telugu News