అమెరికాలో విచిత్రం: మేయర్ గా ఎన్నికైన మేక.. సభ్యులుగా 15 ఇతర జంతువులు!

  • అగ్రరాజ్యంలోని ఫెయిర్ హెవెన్ లో ఘటన
  • నిధుల సేకరణకు సరికొత్త ఆలోచన చేసిన అధికారులు
  • పిల్లలకు ఓటు హక్కు విలువ తెలిసిందని వ్యాఖ్య
అమెరికాలో వింతలు, విచిత్రాలకు కొదవ ఉండదు. అక్కడ టీనేజర్లను సైతం మేయర్లుగా ఎన్నుకుంటూ ఉంటారు. తాజాగా మసాచుసెట్స్ లోని ఫెయిర్ హెవెన్ టౌన్ లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ నగరానికి మేయర్ గా మూడేళ్ల వయసున్న లింకన్ అనే బుజ్జి మేక ఎన్నికయింది.

శామీ అనే కుక్కపై పోటీచేసిన లింకన్ 3 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా నగర కౌన్సిల్ కు మరో 15 జంతువులు కూడా ఎన్నికయ్యాయి. కాగా, లింకన్ ఫెయిల్ హెవెన్ కు ఏడాది కాలం పాటు మేయర్ గా వ్యవహరించనుంది.

ఈ విషయమై టౌన్ మేనేజర్ జో గంటర్ మాట్లాడుతూ.. పట్టణంలోని స్కూలు మైదానాన్ని అభివృద్ధి చేసేందుకు నిధుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దీనివల్ల పిల్లలకు ఓటు హక్కు విలువ తెలిసిందని వ్యాఖ్యానించారు. కాగా, మేక మేయర్ గా ఎన్నిక కావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
USA
mayor
goat
lincoln
fair heaven
election

More Telugu News