విశాఖ రైల్వేజోన్ ను 11 నెలల్లో ప్రారంభించేలా చర్యలు చేపట్టాం: మంత్రి పీయూష్ గోయల్
- ఇప్పటికే ఓఎస్ డీని నియమించాం
- జోన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు సమయం
- ఈ ప్రక్రియ మొత్తం మూడేళ్లలో పూర్తి చేసేలా కృషి
ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, విశాఖ రైల్వేజోన్ ను పదకొండు నెలల్లో ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ జోన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఓఎస్ డీని నియమించామని, జోన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు సమయం పడుతుందని, ఈ ప్రక్రియ మొత్తం మూడేళ్లలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.