Telangana: మెదక్ లోక్ సభ స్థానాన్ని గెలిచి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలి: టీఆర్ఎస్ నేత హరీశ్ రావు

షార్ట్స్‌లో చూడండి
మెదక్ లోక్ సభ స్థానాన్ని గెలిచి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపు నిచ్చారు. మెదక్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఈ జిల్లా బిడ్డ కావడం వల్లనే అభివృద్ధి సాధ్యమవుతోందని, అందుకు  కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో ఐదు లక్షల మెజార్టీతో మెదక్ ఎంపీని గెలిపించాలని ప్రజలను కోరారు. గజ్వేల్, మెదక్ కు రెండు నెలల్లో రైలు రాబోతోందని, త్వరలోనే నర్సాపూర్ బస్సు డిపోను ప్రారంభిస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల మెతుకు సీమ ‘మెదక్’ వలసల జిల్లాగా మారిందని విమర్శించారు. ఈ జిల్లాకు జులై నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రానున్నాయని చెప్పారు.
Go Back to Shorts
Telangana
medak
TRS
mla
Harish Rao

More Telugu News