chiranjeevi: 'సైరా' గురించి చిరంజీవిని ఇంటర్వ్యూ చేయనున్న చరణ్

షార్ట్స్‌లో చూడండి
మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సైరా' సినిమాపైనే వుంది. ఈ సినిమాను గురించి .. అది సృష్టించబోయే సంచలనాలను గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను గురించి చిరంజీవిని చరణ్ ఇంటర్వ్యూ చేయనున్నాడట. 'సైరా' సినిమా ప్రత్యేకత .. దాని విశిష్టత .. ఆయా పాత్రలను మలచిన విధానం .. లుక్స్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు .. కాస్ట్యూమ్స్ పై పెట్టిన శ్రద్ధ .. షూటింగ్ విశేషాలు .. అనుభవాలు .. బడ్జెట్ సంబంధమైన వివరాలు ఇలా అనేక విషయాలను గురించి చిరంజీవిని చరణ్ ఇంటర్వ్యూ చేస్తాడట. ఈ సినిమాకి చరణ్ నిర్మాత అనే విషయం తెలిసిందే. మార్కెట్ పరంగా ఈ సినిమాకి మరింత హైప్ తీసుకురావడం కోసమే ఈ ఇంటర్వ్యూను ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూ తరువాత బిజినెస్ డీల్స్ మొదలవుతాయనే టాక్ వినిపిస్తోంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అమితాబ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
chiranjeevi
nayanatara

More Telugu News