టీఆర్ఎస్ లో చేరనున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య!
- ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ
- నియోజకవర్గ సమస్యలు, రాజకీయాలపై చర్చ
- ఇటీవల కాంగ్రెస్ ను వీడిన కాంతారావు, సక్కు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కులు ఇటీవల టీఆర్ఎస్ లో చేరుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ వైపు మొగ్గడం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.