అమెరికాలో ఫేస్ బుక్ కు షాక్.. భారీ సంఖ్యలో దూరమవుతున్న యూజర్లు
- 2017 నుంచి దాదాపు 1.5 కోట్ల మంది దూరం
- ఫేక్ న్యూస్, యాడ్స్ తో చికాకు పడుతున్న యూజర్లు
- వ్యక్తిగత సమాచారం దోపిడీ కూడా ఒక కారణం
ఫేస్ బుక్ కు దూరమవుతున్న వారు క్రమంగా ఇన్స్టాగ్రామ్ కు దగ్గరవుతున్నారు. ఫేస్ బుక్ లో ఫేక్ న్యూస్ ఎక్కువగా షేర్ అవుతుండటం, యాడ్స్ పెద్ద తలనొప్పిగా మారడం యూజర్లకు చికాకును తెప్పిస్తోంది. వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ బుక్ చోరీ చేస్తోందనే అసంతృప్తి కూడా ఫేస్ బుక్ యూజర్లలో బలంగా ఉంది. డేటా చోరీ అంశంలో ఫేస్ బుక్ ఇప్పటికే విచారణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో, ఫేస్ బుక్ కు భారీ ఎత్తున అమెరికన్లు గుడ్ బై చెబుతున్నారు. ఇన్స్టాగ్రామ్ కు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.