ఇండియాలో తొలిసారిగా... త్వరలోనే రూ. 20 నాణెం విడుదల... ఎలా ఉంటుందంటే..!
- 12 అంచులు కలిగి ఉన్న నాణెం
- నాణేనికి రెండు రింగులు
- విడుదల తేదీని ప్రకటించని కేంద్ర ఆర్థిక శాఖ
ఈ నాణెంపై అశోక స్తంభం 'సత్యమేవ జయతే' సూక్తి, భారత్ అన్న హిందీ అక్షరాలు, ఇండియా అన్న ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. రూ. 10 నాణేల అంచులపై ఉన్నట్టుగా దీనిపై ఏ విధమైన మార్క్ ఉండవు. దాదాపు పదేళ్ల క్రితం రూ. 10 నాణెం చలామణిలోకి రాగా, ఆపై 14 సార్లు డిజైన్ ను మార్చిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఈ నాణేలు చెల్లవంటూ వదంతులు రాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని కొట్టిపారేసింది.