​ అజారుద్దీన్ తనయుడితో సానియా మీర్జా చెల్లెలు పెళ్లి?

  • తరచుగా బయట కనిపిస్తున్న సెలబ్రిటీ వారసులు
  • సోషల్ మీడియాలో ప్రేమ పొంగిపొర్లే పోస్టులు
  • పెళ్లే తరువాయి అంటూ మీడియాలో కథనాలు
భారత క్రీడారంగంలో మహ్మద్ అజారుద్దీన్, సానియా మీర్జా వేసిన ముద్ర అనన్యసామాన్యం అని చెప్పాలి. అజార్, సానియా ఎలాంటి అవకాశాలు లేని దశ నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ తాము ఎంచుకున్న క్రీడకే వన్నె తెచ్చారు. తాజాగా, అజార్ తనయుడు అసద్ (28), సానియా చెల్లెలు ఆనమ్ మీర్జా (25) త్వరలోనే ఒకింటివారవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా అసద్, ఆనమ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు వారి సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే అర్థమవుతుంది.

ఫిబ్రవరిలో ఆనమ్ పుట్టినరోజు సందర్భంగా అసద్ పెట్టిన పోస్టే వారి మధ్య అనుబంధానికి నిదర్శనం అంటున్నారు. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు అజార్ తనయుడు. అంతేకాదు, మీర్జా సోదరీమణులు సానియా, ఆనమ్ ల తోనూ ఓ ఫొటోలో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం అజార్ కుటుంబం దుబాయ్ లో షాపింగ్ చేస్తుండడం కూడా పెళ్లి కోసమే అన్న వార్తలకు ఊతమిస్తోంది. ఇక అసద్ తండ్రి బాటలోనే కొన్నాళ్లు క్రికెట్ ఆడినా అందులో పెద్దగా రాణించలేకపోయాడు. ప్రస్తుతం న్యాయవాదిగా కెరీర్ మొదలుపెట్టాడు. ఇక ఆనమ్ మీర్జా ఫ్యాషన్ డిజైనర్ గా ఎదుగుతోంది.
Go Back to Shorts
Sania Mirza

More Telugu News