New Delhi: ​ అలా అయితే కేజ్రీవాల్ ఈపాటికి బిన్ లాడెన్ అయ్యుండేవాడు!: ఆప్ రెబెల్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా

షార్ట్స్‌లో చూడండి
ఆమ్ ఆద్మీ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడికి పాల్పడిన అదిల్ దార్ పోలీసులు కొట్టిన ఓ చెంపదెబ్బ కారణంగానే ఉగ్రవాదిగా మారాడంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. ఓ చెంపదెబ్బతో ఎవరైనా ఉగ్రవాదిగా తయారవుతారనుకుంటే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈపాటికి ఒసామా బిన్ లాడెన్ అయ్యుండేవాడని వ్యాఖ్యానించారు.

మంగళవారం నాడు జేఎన్ యూలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికల సందర్భంగా మూడు సంఘటనల్లో కేజ్రీవాల్ చెంపదెబ్బలు తిన్నారని, మరి ఆయనేం అయిపోవాలంటూ ప్రశ్నించారు. ఆనాడు కేజ్రీవాల్ ను చెంపదెబ్బ కొట్టినవారిలో ఓ ఆటో డ్రైవర్ కూడా ఉన్నారని గుర్తుచేశారు కపిల్ మిశ్రా. జేఎన్ యూ ప్రాంగణాలు సంఘవిద్రోహ శక్తుల ఉత్పత్తి కేంద్రాలుగా తయారవుతున్నాయని, ఇప్పుడు ఐఐటీలు కూడా వామపక్ష అతివాదులు, నక్సల్స్ కు పుట్టినిల్లుగా తయారవుతున్నాయని ఆరోపించారు.
Go Back to Shorts
New Delhi

More Telugu News