నేను ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని చూస్తుంటే.. వాళ్లు నన్నే తొలగించాలని చూస్తున్నారు: మోదీ
- కాంగ్రెస్ రైతుల సంగతే మరచిపోతుంది
- వ్యతిరేకంగా మాట్లాడేవారిని క్షమించరు
- కాంగ్రెస్ చేతిలో కుమారస్వామి రిమోట్
- ఎన్నో ప్రాజెక్టులను అసంపూర్తిగా మిగిల్చింది
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రిమోట్ కాంగ్రెస్ చేతిలో ఉందని.. ఆయన ఆ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. తాను ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని చూస్తుంటే.. విపక్షాలు తననే తొలగించేందుకు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులను అసంపూర్తిగా మిగిల్చిందని.. తమ ప్రభుత్వం ఇప్పుడు వాటిని పూర్తి చేస్తోందని మోదీ తెలిపారు.