Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర విశాఖపట్నంలో రూ.33,740, ప్రొద్దుటూరులో రూ.33,000, చెన్నైలో రూ.32,250గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర విశాఖపట్నంలో రూ.30,610, ప్రొద్దుటూరులో రూ.30,720, చెన్నైలో రూ.30,780గా ఉంది. వెండి కిలో ధర విశాఖపట్నంలో రూ.39,300, ప్రొద్దుటూరులో రూ.39,600, చెన్నైలో రూ.41,400 వద్ద ముగిసింది.