కోటప్పకొండ తిరునాళ్లలో అపశ్రుతి.. కూలిన భారీ ప్రభ
- నేడు ప్రారంభం కానున్న తిరునాళ్లు
- ప్రభను కొండపైకి తీసుకొస్తుండగా ఘటన
- పలువురికి గాయాలు
మహా శివరాత్రిని పురస్కరించుకుని నేడు కోటప్పకొండ తిరునాళ్లు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. కొండపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ తిరునాళ్లకు ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.