జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి ఓటునే తొలగించేశారు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?: మిథున్ రెడ్డి
- ఏపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించింది
- అక్రమంగా సమాచారాన్ని ప్రైవేటు కంపెనీకి ఇచ్చింది
- పోలీసుల విచారణలో నిజాలు బయటకు వస్తాయి
జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందారెడ్డి ఓటును సైతం టీడీపీ నేతలు తొలగించారని మిథున్ రెడ్డి ఆరోపించారు. వివేకానందరెడ్డి స్వయంగా తన ఓటును తొలగించాలని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసినట్లు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కుటుంబ సభ్యుల ఓట్లే గల్లంతు అవుతుంటే ఇక సామాన్యుల సంగతి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.