హిందూ జనజాగృతి కరీంనగర్ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- షరతుతో కూడిన అనుమతి మంజూరు
- తొలుత సభకు పోలీసుల అనుమతి
- హాజరయ్యే వారిలో రాజాసింగ్ పేరు చేర్చడంతో అభ్యంతరం
తర్వాత సభ నిర్వహణకు ముందు ఇచ్చిన జాబితాలో రాజాసింగ్ పేరు చేర్చడంతో పోలీసులు అనుమతిచ్చేందుకు నిరాకరించారు. దీంతో నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి రాజాసింగ్ అంశాన్ని ప్రస్తావించారు. ఆయనను ఆహ్వానించకుండానే సభ నిర్వహించుకుంటామని నిర్వాహకులు కోర్టుకు తెలియజేయడంతో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.